పెళ్లి పీటలెక్కిన సాయిపల్లవి-నాగచైతన్య

సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి కాంబోలో తెరకెక్కుతునన్న ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. ఏషియన్ అధినేత సునీత్ నారంగం దీనిని నిర్మిస్తున్నారు.

saipallavi love story

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సాయిపల్లవి-నాగచైతన్య పెళ్లిపీటలపై కూర్చుని ఉన్నారు. దీనిని బట్టి చేస్తూ సినిమాలో ప్రేమవివాహం చేసుకుంటారని క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో చైతూ, సాయిపల్లవి ఒకరివైపు ఒకరు చూసుకుంటూ చాలా క్యూట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఏప్రిల్ 2నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. దీంతో త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.