మహేష్ హీరోయిన్‌కు కరోనా

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ కృతిసనన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాజ్‌కుమార్‌రావుతో కలిసి కృతిసనన్ ఒక సినిమా చేస్తుండగా… ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల ఛండీగడ్ వెళ్లింది. అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకునున్న అనంతరం తాజాగా తిరిగి చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేసింది. ఢిల్లీకి వచ్చిన అనంతరం కరోనా టెస్టు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

kriti sanon

కృతిసనన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించగా.. త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించనుందనే వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో మాత్రమే సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ సెలబ్రెటీలు నీతూకపూర్, మనీపాల్, వరుణ్ ధావన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ సినిమా షూటింగ్‌ను మధ్యలు ఆపేసి వచ్చేశారు. ప్రస్తుతం వీళ్లు కరోనా చికిత్స పొందుతుండగా.. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లలో పాల్గొన్నారు. ఇప్పటికే బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు గతంలో కరోనా సోకగా.. ఆయన కోలుకుని బయపటడ్డారు. అలాగే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.