తెలంగాణ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ ఇటీవలె నటి సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అనుకోకుండా ఒక కుటుంబం పేరు రావడం జరిగిందని, పూర్తిగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండ సురేఖ తెలిపారు. తన వల్ల ఒక ఆడపిల్ల బాధపడటం తప్పే అంటూ ఆమె అన్నారు. ట్విట్టర్ ద్వారా వారి స్పందనను తెలుసుకున్నట్లు కొండా సురేఖ తెలిపారు.