సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి భారీ చిత్రాలను రూపొందించిన పా.రంజిత్.. వీటి తర్వాత తీసిన సర్పాట్ట-పరంబరై డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సింగ్ ఆట నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కింది. తరతరాలుగా బాక్సింగ్‌కు అంకితమైన ఓ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ అందులోకి అడుగు పెట్టిన యువకుడి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉన్నా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జులై 22న తమిళ, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కావడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ నుంచి నేరుగా ఒటిటిలోకి స్ట్రీమ్ అవనున్న పెద్ద ప్రాజెక్ట్స్ ‘సార్పట్ట’ కావడం విశేషం. తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు ఆర్య ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు బాక్సర్లుగా నటించిన ఇతర నటులు సైతం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.