సినిమా కోసం నగ్నంగా నటించిన మరో తమిళ హీరోయిన్

ఆమె సినిమా కోసం అమలా పాల్ నగ్నంగా నటించింది. సెన్సేషన్ సృష్టించిన ఈ రోల్ తర్వాత అమలా పాల్ చాలా జాగ్రతలు తీసుకోని నగ్నంగా నటించాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు అమలా పాల్ బాటలో నడుస్తూ మరో కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా కూడా నగ్నంగా నటించింది. కోలీవుడ్ లో నటిగా, గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా పిసాసు 2 సినిమాలో న్యూడ్ గా చేసింది. 2016లో మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్ గా ‘పిశాసు-2’ సినిమా వస్తోంది. ఈ సినిమాలోనే ఆండ్రియా నగ్నంగా నటించింది. డైరెక్టర్ మిస్కిన్ ఈ సీన్స్ ని కొద్దిమంది సమక్షంలోనే తెరకెక్కించాడట.

ఆండ్రియా నగ్నంగా నటించారన్న వార్తపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ సినిమాలో ఒక పర్టికులర్ సీన్ కోసం ఆండ్రియా అలా నటించిందని కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ‘పిశాసు-2’ సినిమాలో విజయ్ సేతుపతి, పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణి తదిరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. కథలోని పాత్ర డిమాండ్ చేయడంతోనే ఆండ్రియా అలా చేసిందని సమాచారం. ఆమె సినిమా అమలా పాల్ కి ఉపయోగ పడలేదు మరి ఈ సినిమా ఆండ్రియాకి అయినా ఉపయోగ పడుతుందేమో చూడాలి.