జూన్ నుంచి నాగ్ సెకండ్ షెడ్యూల్…

వైల్డ్ డాగ్ తో ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో మెరిసిన కింగ్ నాగార్జున, మరో యాక్షన్ ఎంటర్టైనర్ కి సిద్దమయ్యాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్ ని ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. గరుడ వేగ తరహాలో ఉండబోయే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు.

కరోనా రెస్ట్రిక్షన్స్ రాకముందే షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ ని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ను జూన్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.