త్వరలో కీర్తి సురేష్ పెళ్లి.. వరుడెవరో తెలుసా?

మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌తో కీర్తి సురేష్ ప్రేమాయణం నడుపుతుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయినా దీనిపై ఆ జంట ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది.

keerthy suresh marriage with anirudh

త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. 2021 చవర్లో ఈ పెళ్లి ఉంటుందని టాక్. గత ఏడాది అక్టోబర్ 16న అనిరుధ్ పుట్టినరోజు కాగా.. అక్టోబర్ 17న కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా అర్థరాత్రి సమయంలో వీరిద్దరి కలిసి కేక్ కట్ చేసిన వార్త మీడియాలో హాట్‌టాపిక్‌గా ఉంది. అప్పటినుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే వార్త వినిపిస్తోంది.