తెలంగాణ పాలిటిక్స్‌లో పెను మార్పు జరగనుందా?.. సీఎం మారనున్నారా?.. కేసీఆర్ స్థానంలో ఆయన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారా?.. అంటే అవుననే తెలుస్తోంది.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో అలాంటి పరిణామమే ఒకటి జరగబోతోంది. ఫిబ్రవరిలో తెలంగాణ రాజకీయాల్లో అలాంటి, ఇలాంటి మార్పు కాదు.. పెను మార్పు ఒకటి జరగబోతోంది. ఏకంగా సీఎం మారబోతున్నారు. ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం నిజమై.. తన కుమారుడు కేటీఆర్‌కు సీఎంగా కేసీఆర్ పగ్గాలు అందించబోతున్నారు. ఫిబ్రవరి నెల ఈ కీలక పరిణామానికి సాక్షి కాబోతోంది.
ఫిబ్రవరి 18న సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని విశ్వసనీయ వర్గాల తెలుస్తోంది. కేటీఆర్‌కు సీఎంగా కేసీఆర్ బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్నందున కేటీఆర్‌ను సీఎం చేస్తారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. కానీ అవి ప్రచారంగానే మొన్నటివరకు మిగిలిపోయాయి. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయి. ఫిబ్రవరి 18న కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమంగా తెలుస్తోంది.