Maheshbabu: ఈ రోజు ఎంతో ప్ర‌త్యేక‌మైనది: మ‌హేశ్‌బాబు

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు భార్య న‌మ్ర‌త నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో న‌మ్ర‌త‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నేనెంతో ప్రేమించే వ్య‌క్తి పుట్టిన‌రోజు నేడు, నీతో ప్ర‌తిరోజూ ప్ర‌త్యేకంగా ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం మ‌రెంతో ప్ర‌త్యేకం. నా అద్భుత‌మైన మ‌హిళ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. హ్యాపీ బ‌ర్త్‌డే బాస్ లేడీ అని పోస్ట్ చేశాడు Maheshbabu మ‌హేశ్‌. దీనికి న‌మ్ర‌త స్పందిస్తూ..

mahesh-namratha

నా పుట్టిన‌రోజు నాడు ప్ర‌తి ఏడాదినీ ఎంతో స్పెష‌ల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ.. ల‌వ్‌యూ అని రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం Maheshbabu మ‌హేశ్ తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట షూటింగ్ కోసం కుటుంబంతో క‌లిసి దుబాయ్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. న‌మ్ర‌త పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్క‌డ‌నే సెల‌బ్రేట్ చేసుకుంటారు. అనంత‌రం ఈ సినిమా షూటింగ్‌లో మ‌హేశ్ జాయిన్ అవుతార‌ని, తిరిగి కుటుంబ‌స‌భ్యులు ఇండియాకు వ‌చ్చేస్తార‌ని స‌మాచారం. ఇక Maheshbabu గ‌తేడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వాత గీత గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌ర్కార్ వారి పాట చిత్రంలో మ‌హేశ్ న‌టిస్తుండ‌గా.. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జీఎంబీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ మ్యూజిక్‌డైరెక్ట‌ర్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.‌