విడుదలకు ముందే ‘క్రాక్’ సినిమాకు 4 స్టార్స్ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో గోపీచంద్-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన బలుపు, డాన్ శీను సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో వారిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

raviteja krack review

ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 11 వేల స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్‌కు మరి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో.. సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షూరూ చేసింది. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.

ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ కనుక అతనికి త్రీ స్టార్స్ ఉన్నాయని, ఆ స్టార్‌కి నేను ఇంకో స్టార్ యాడ్ చేస్తున్నానని కత్తి చెప్పాడు.