వ‌కీల్‌సాబ్ ఫైట్ సీన్స్ లీక్ చేసిన విల‌న్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ చిత్రంతో బిజీబిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన పింక్ సినిమాకు రీమేక్ అవుతున్న వ‌కీల్‌సాబ్ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ కాబోతుండ‌గా.. ఇప్పుడు రెండు ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ చిత్రంలోని క్లైమాక్స్‌లో వ‌చ్చే ఫైట్స్‌కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్‌గా మారాయి. అయితే వీటిని ఈ సినిమాలో విల‌న్ పాత్ర చేసిన న‌టుడు దేవ్‌గిల్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా పంచుకున్నాడు.

pawan fight vakeel saab

అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఫోటోలను చూసి నెటిజ‌న్ల్ సోష‌ల్‌మీడియాలో షేర్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తుండ‌గా, అంజ‌లి, నివేథాథామ‌స్‌, అన‌న్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.