నిక్కీ గర్లాని… కృష్ణాష్టమి, మలుపు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన కన్నడ బ్యూటీ. పుట్టింది కర్ణాటకలో అయినా తమిళ మలయాళ భాషల్లో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే తమిళ్ లో మూడు సినిమాలకి సైన్ చేసిన నిక్కీ, రీసెంట్ గా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. నిజానికి సెలబ్రిటీస్ తమ పర్సనల్ విషయాలని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు కాని నిక్కీ మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నిక్కి గర్లాని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో పడ్డానని చెప్పింది. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టమని చెప్పింది. లవ్ చేస్తున్నా అనే విషయం చెప్పేసిన నిక్కీ, ఎవరిని చేస్తుంది? ఆ అదృష్టవంతుడు ఎవరు అనే విషయం మాత్రం బయటకి చెప్పలేదు. త్వరలోనే అతని పేరుని బయటపెడతానని చెప్పిన నిక్కీ గర్లాని, మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది.