Kangana: బాలీవుడ్ క్వీన్‌కు షాకిచ్చిన ట్విట్ట‌ర్‌…

Kangana: బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ వివాదాల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. నిత్యం ఏదోక వివాదంతో వార్తాల్లోకెక్కుతుంటారు. అయితే తాజాగా భార‌త్‌లో రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా పాప్ సింగ‌ర్ రిహానా ట్వీట్ చేయ‌డం వివాదానికి తెర‌లేపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో Kangana కంగ‌నా పాప్ సింగ‌ర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. ఈ క్ర‌మంలో రైతులు ఉగ్ర‌వాదులుగా పేర్కొంటూ కంగ‌నా ట్వీట్ చేశారు.

kangana ranaut latest issue

దిల్లీలో ఉద్య‌మం చేస్తుంది రైతులు కాద‌ని, వారంతా ఉగ్ర‌వాదులంటూ Kangana కంగనా ట్వీట్ చేసింది. దీంతో కంగ‌నా ట్వీట్ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వడంతో వాటిని ట్విట్ట‌ర్ తొల‌గించింది. అయితే పాప్ సింగ‌ర్ రిహానా తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు రైతుల‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేయ‌డం తీవ్ర దుమారానికి దారితీసింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆ ట్వీట్ల‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. మా అంత‌ర్గ‌త విష‌యాల్లో మీ జోక్యం ఏంటి అంటూ మండిప‌డింది.