ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మధుడు’ భామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది.

ANSHU IN NTR MOVIE

ఇందులో మన్మథుడు భామ అన్షు కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమాలో అన్షు నటించింది. అందులో తన ఇనోసెంట్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో.. టాలీవుడ్‌కి పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో అన్షుకి అవకాశం వచ్చినట్లు సమాచారం.