Tollywood: “ఇదే మా క‌థ” అంటూ రెడీ అవుతున్న‌ సుమంత్ అశ్విన్‌!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ న‌టిస్తున్న తాజా చిత్రం ఇదే మా క‌థ‌. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం తుది ద‌శ‌కు చేరుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుగుతుండ‌గా.. ఈ చిత్రానికి గురుపవ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో సుమంత్ అశ్విన్‌తో పాటు శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.

sumanth aswin new movie

ఇదే మా క‌థ చిత్రాన్ని మార్చి 19న విడుద‌ల చేయ‌బోతున్నారు.. Tollywood రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రైడ‌ర్స్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. Tollywood ఇక ఈ చిత్రాన్ని జి. మ‌హేశ్ నిర్మిస్తుండ‌గా.. సునీల్ క‌శ్య‌ప్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంచితే త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు సుమంత్‌ అశ్విన్‌.. ఈ నెల 13న అమెరికాలో ఎమ్మెస్ చేసిన దీపిక‌తో సుమంత్ వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని సుమంత్ తండ్రి ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎం. ఎస్‌. రాజు వెల్ల‌డించారు.