ఇండియన్ కోసం కమల్ కొత్త విషయం నేర్చుకుంటున్నాడు…

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ని కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. వెనక్కి తిరిగున్న సేనాపతిని చూసి నెటిజెన్స్ కూడా ఫిదా అయ్యారు. భారతీయుడు వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటికకీ కమల్ అలానే ఎలా ఉన్నాడు అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే సినిమా కోసం ఏదైనా చేసే కమల్ హాసన్, ఇండియన్ 2 కోసం కొత్త బాషా నేర్చుకుంటున్నాడు.

Indian2

ప్ర‌స్తుతం ఇండియన్ 2 షూటింగ్ మ‌ధ్యప్ర‌దేశ్‌లో జ‌రుగుతోంది. ఇటీవ‌ల స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు కానీ కమల్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కోసం షెడ్యూల్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ కంప్లీట్ అవడంతో చిత్ర యూనిట్, మళ్లీ కంటిన్యూటీ షూటింగ్ మొదలుపెట్టారు… మధ్యప్రదేశ్ షెడ్యూల్ కి కొన‌సాగింపుగా స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో గుజ‌రాతీ మాట్లాడే స‌న్నివేశాల్లో న‌టించాల్సి ఉంది. దాని కోసం క‌మ‌ల్‌హాస‌న్ గుజ‌రాతీ నేర్చుకుంటున్నార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.