సోషల్ మీడియాని షేక్ చేసిన రెబల్ స్టార్ ఫాన్స్

జాన్ సినిమాని భారీ స్థాయిలో మొదలుపెట్టనున్న రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే యూరోప్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ చేయబోతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ మాత్రం బయటకి రాలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అనే ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు.

1970ల్లో జరిగే ప్రేమకథగా తెర‌కెక్కనున్న జాన్ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ #wewantprabhas20update అంటూ ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇదే ట్రేండింగ్ లోకి వచ్చి ప్రభాస్ అభిమానులంతా ట్వీట్స్ చేశారు. ట్విట్టర్ లో #wewantprabhas20update బాగా ట్రెండ్ అయ్యింది కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. గోపికృష్ణ మూవీస్ తో పాటు యూవీ క్రియేషన్స్ కూడా కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అయినా అప్డేట్ వస్తుందేమో చూడాలి.