80’s రీయూనియన్ లో బాలయ్య ఎందుకు లేడు?

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్స్ సందడి చేశారు.. ఎవ్రి ఇయర్ 1980లో కలిసి నటించిన స్టార్స్ అంతా ఒక చోట కలుస్తుంటారు. ఈసారి ఈ రెట్రో గెట్ టు టుగెదర్ కి స్టార్స్ అంతా యునైట్ అయ్యారు. డికేడ్ కాలంగా ఈ రీయూనియన్ జరుగుతుండడం విశేషం. 10th రీయూనియన్ కాబట్టి చిరు స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేసి, ఇంట్లోనే ట్రీట్ ఇచ్చాడు.

ఈ పార్టీకి ఖుష్బూ, సుమలత, రాధిక, నదియా, రమ్యకృష్ణ, భాగ్యశ్రీ, జయసుధ, లిజీ, వెంకటేష్, పూర్ణిమ, నరేష్, భానుచందర్, సురేష్‌, మోహన్ లాల్ వంటి వారు హాజరయ్యారు. ఈ వేడకలో అలనాటి అందాల తారలు ఒకే వేదికపై ర్యాంప్ వాక్ కూడా చేసి… అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే ప్రతి ఏటా జరిగే ఈ రీయూనియన్ ని స్టార్ హీరో బాలకృష్ణ కూడా వెళ్తాడు. మరి ఈసారి బాలయ్య ఎందుకు వెళ్లలేదు? షూట్ లో బిజీగా ఉన్నాడా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.