కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం

నందమూరి హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఇవాళ పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర ఈ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో ఇందులో నటించే నటీనటులను మేకర్స్ ప్రకటించనున్నారు.

KALYANRAM NEW MOVIE

నందమూరి కల్యాణ్ రామ్ 19వ సినిమాగా ఇది రానుంది. మార్చి రెండో వారంలో దీని షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు.