కళ్యాణ్ కృష్ణ అక్కినేని వారికి షాక్ ఇస్తాడా? స్వీట్ న్యూస్ చెప్తాడా?

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారసులు కలిసి నటించిన సినిమా మనం. అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడానికి అక్కినేని నాగార్జున చైతన్యలు రెడీ అయ్యారు. కింగ్ నాగ్ నటించిన సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన, ఈ సినిమాకి ప్రీక్వెల్ వస్తుంది అనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడని సమాచారం.

సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ కలయికగా రానున్న ఈ బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కూడా నటించనున్నాడని తెలుస్తోంది. మరి నాగ చైతన్య, బంగార్రాజు మనవడి పాత్రలో నటిస్తాడా? లేక యంగ్ బంగార్రాజు పాత్రలో కనిపిస్తాడా అనేది చూడాలి. ఒకవేళ యంగ్ బంగార్రాజుగా నాగ చైతన్య కనిపిస్తే మాత్రం, నాగార్జున చైలని కలిసి చూసే అవకాశం ఉండదు. మరి కళ్యాణ్ కృష్ణ, ఇద్దరు అక్కినేని హీరోలని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తాడా? లేక విడివిడిగా చూపించి అభిమానులని డిజప్పాయింట్ చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.