తల విక్టరీ సెంటిమెంట్ తలైవాకి వర్కౌట్ అవుతుందా శివ?

సంక్రాంతికి దర్బార్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్, సాలిడ్ హిట్ పై కన్నేశాడు. రజినీ మేనియాకి మురుగదాస్ కూడా కలవడంతో దర్బార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య, ఊపిరిసలపని పోటీ మధ్య రిలీజ్ కానున్న దర్బార్ సినిమా బాక్సాఫీస్ దెగ్గర ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది ఆసక్తికరమైన విషయం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసిన రజినీకాంత్, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

rajinikanth vyuham

స‌న్‌పిక్చ‌ర్స్ నిర్మించనున్న ఈ మూవీని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ మూవీ న‌వంబ‌ర్ నుండే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని కోలీవుడ్ వర్గాల టాక్‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి వ్యూహం అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట. ఇప్పటి వరకూ శివ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల టైటిల్స్ ‘వి’తోనే స్టార్ట్ అయ్యాయి. వీరం, వివేకం, విశ్వాసం… ఇలా తల అజిత్ హీరోగా ‘వి’తో శివ చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది కాబట్టి, తలైవా రజినీకాంత్ తో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ వ్యూహం అనే టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరి అజిత్ ‘వి’తో విక్టరీ కొట్టిన శివ, రజినీ ‘వి’తో కూడా అదే సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.