kajal: సిగ‌రెట్ తాగుతూ క‌నిపించిన కాజ‌ల్‌.. అంతా షాక్‌!

kajal: కాజ‌ల్ అగ‌ర్వాల్ టాలీవుడ్ చంద‌మామ‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆమె గ‌తేడాదే గౌత‌మ్ కిచ్లుతో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. కానీ త‌న కెరీర్ విష‌యంలో మాత్రం ఎటువంటి స‌మ‌స్య లేదు.. ఎందుకంటే కాజ‌ల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదుంది. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌లో హీరోయిన్‌గా చేస్తోంది కాజ‌ల్‌.. అలాగే క‌మ‌ల్‌హాస‌న్‌తో స్క్రీన్ పంచుకుంటున్న కాజ‌ల్‌.. అలాగే బాలీవుడ్‌లో సాగ అనే చిత్రంలో ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తుంది kajalఈ భామ‌.

kajal aggerwal

అయితే ఆమె తాజాగా న‌టించిన తొలి వెబ్‌సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఫిబ్ర‌వ‌రి 12న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయింది. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా ఇందులో kajal కాజ‌ల్ జ‌ర్న‌లిస్ట్ పాత్రను పోషించ‌గా.. ఇందులో దెయ్యం త‌ర‌హా పాత్ర‌లో ఈ భామ అల‌రించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో కాజ‌ల్ సిగ‌రెట్ తాగుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో కాజ‌ల్ సిగ‌రెట్ తాగ‌డం ఏంటీ అని నెటిజ‌న్లు అంతా షాక్ గుర‌వుతున్నారు.. కానీ ఈ సిరీస్‌లోkajal కాజ‌ల్ సిగ‌రెట్ కాల్చే సంద‌ర్భాలు ఉన్నాయి.. కాబ‌ట్టి ఇవి కాస్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి అంతే.