కాజల్ అగర్వాల్ వివాహం గురించి గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెకు కాబోయే భర్తకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముంబై మీడియా కథనం ప్రకారం, కాజల్ అగర్వాల్ కి ఇప్పటికే గౌతమ్ కిచ్లు అనే పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది.
గౌతమ్ కిచ్లు ఇంటీరియర్ కంపెనీ “డిసర్న్ లివింగ్” అనే సంస్థను కలిగి ఉన్నారు. ఇక వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు టాక్. గౌతమ్ తన తల్లిదండ్రుల ద్వారా కాజల్ అగర్వాల్‌ను కలిశాడని సమాచారం. ఇక వీరి వివాహం 2021 మొదట్లోనే జరిగే అవకాశం ఉందట. కాజల్ అగర్వాల్ త్వరలో ఆమె పెళ్లి గురించి ఒక ప్రకటన చేయనున్నారు. ఇక కాజల్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి యొక్క “ఆచార్య” మరియు కమల్ హాసన్ యొక్క “ఇండియన్ 2” లను కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ వయసు 35. ఇక ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ తన ప్రియుడిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అమెకు ఒక బాబు కూడా ఉన్నాడు.