తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి ‘తలసాని శ్రీనివాస్ యాదవ్’ గారు!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమంకి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.