విలన్ కురిపిస్తున్న వసూళ్ల వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది

హాలీవుడ్ సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఉంటుంది. భారీ సినిమా ఏది వచ్చినా ఇండియన్ మూవీ లవర్స్ వాటికి బ్రహ్మరథం పడతారు. రీసెంట్ గా వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ అందుకు ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ సాధించిన దాంట్లో ఇండియా నుంచే 351 కోట్లు రాబట్టింది అంటే మన ప్రేక్షకులు ఇంగ్లీష్ సినిమాలంటే ఎంత ఇష్టపడతారో అర్ధం చేసుకోవచ్చు. మన మార్కెట్ సొంతం చేసుకోవడానికి ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు వస్తూ ఉంటాయి, ఆ కోవలోకే చేరిన కొత్త సినిమా జోకర్.

joker

ఫిలిప్స్ తెరకెక్కిన జోకర్ సినిమాలో జాక్లిన్ ఫోనిక్స్ హీరోగా నటించాడు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇండియాలో 700 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. వార్, సైరా లాంటి పెద్ద సినిమాల రిలీజ్ ఉండగా, జోకర్ 700 థియేటర్స్ లో రిలీజ్ కావడం గొప్ప విషయం. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 16 కోట్లకు అమ్ముడవ్వగా… ఇరవైమూడు రోజుల్లో జోకర్ 63.37 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరిన ఈ సినిమా కొన్న వాళ్లందరికీ లాభాలు తెచ్చిపెట్టింది.