ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరిగే తప్పులని ప్రశ్నిస్తున్న హీరో

ఇప్పటి వరకూ విలేజ్ కుర్రాడిగా, లవర్ బాయ్ గా కనిపించి హిట్స్ అందుకున్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ హీరో. అభిమన్యుడు ఫేమ్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో జరిగే తప్పులు, సీట్ల కోసం, మార్కుల కోసం స్టూడెంట్స్ పడే కష్టాలు ఎన్నో. వాటిని వాడుకుంటూ డబ్బులు సంపాదించే వారు చాలా మందే ఉన్నారు. ఆ ఎడ్యుకేషన్ అమ్మడం అనే పద్ధతి కారణంగా ఎంతో మంది తెలివైన విద్యార్థులు నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరి కోసం ఫైట్ చేయడానికి వ్యక్తి కథనే హీరో సినిమా. శివ కార్తికేయన్ ఈ సినిమాతో కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి మారాడు. మొదటి సినిమాకే డేటా దొంగిలించడం లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమా చేసిన మిత్రన్, మరోసారి హీరోతో మంచి మెసేజ్ ఉండే సినిమా చేస్తున్నాడు. శంకర్ తీసిన జెంటిల్ మ్యాన్ సినిమా ఛాయలు హీరోలో కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ఈ మూవీలో విలన్ గా నటిస్తుండగా, అర్జున్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాలో కళ్యాణ్ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది.