ధనుష్ పంచ కట్టి, కత్తి పట్టి 150 కోట్లు కొల్లగొట్టాడు…

కోలీవుడ్ లో ధనుష్ కంటూ ఒక స్పెషల్ స్టైల్ ఉంది. తెరపై హీరోగా కనిపించకుండా మామలు మనిషిలా కనిపించగల సత్తా ఉన్న అతితక్కువ మంది నటుల్లో ధనుష్ ఒకడు. హీరో కనిపించకుండా పాత్రని మాత్రమే కనిపించేలా చేయడం, ఆ పాత్రతోనే ప్రేక్షకుడిని ట్రావెల్ అయ్యేలా చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ధనుష్ మాత్రం ఇలా చాలా సార్లే చేసి ప్రూవ్ చేసుకున్నాడు. ఆడుకళం సినిమాలో కోడి పందేలు వేసుకునే వాడిలా కనిపించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ధనుష్, నాలుగోసారి వెట్రిమారన్ తో కలిసి చేసిన సినిమా అసురన్.

asuran 150

తమిళ్ తో పాటు తెలుగు హిందీ సినీ వర్గాలు కూడా అసురన్ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మూడో వారంలో కూడా థియేటర్స్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న ధనుష్, కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. మంచి టాక్ తో పాటు వసూళ్లు కూడా రాబడుతున్న అసురన్ సినిమా ఇప్పటి వరకూ 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న నటుడిగా ధనుష్ కోలీవుడ్ యంగ్ హీరోల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.