రిలీజ్ విషయంలోనే కాదు ప్రొమోషన్స్ విషయంలో కూడా పోటీనే

సంక్రాంతి బరిలో పోరుకి సిద్దమైన స్టార్ హీరోలు మహేశ్, బన్నీ ప్రొమోషన్స్ వేగం పెంచుతున్నారు. ముందుగా దీపావళికి సరిలేరు నీకెవ్వరూ చిత్ర యూనిట్ నుంచి ఈ ప్రచారం జోరందుకోగా, నవంబర్ 7 నుంచి బన్నీ పెంచనున్నాడు. దీపావళి ట్రీట్‌కు సిద్ధం అవ్వండని అనిల్‌ రావిపూడి చెప్పేశాడు, దీంతో ఆరోజు సరిలేరు నీకెవ్వరూ టీజర్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా నుంచి కూడా దీపావళికి రాములో రాములా పాటని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ టీజర్ బయటకి వచ్చి మెగా ఫ్యాన్స్ ని అలరిస్తోంది.

allu arjun mahesh babu

సామజవరగమనా, రాములో రాములా పాటలతో అభిమానులని అలరించి. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా నవంబర్‌ 7న టీజర్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రిలీజ్ విషయంలోనే కాదు ప్రొమోషన్స్ విషయంలో కూడా సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాలు పోటీ పడుతూనే ఉన్నాయి. జనవరి 12న ఈ ఇద్దరిలో ఒకరు గెలుస్తారా? లేక ఒకరే నిలబడతారా అనేది చూడాలి.