Bollywood: జాన్వీ లేటేస్ట్ వీడియో సాంగ్ రిలీజ్‌.. అచ్చం శ్రీ‌దేవిలా స్టెప్స్‌!

Bollywood: అతిలోక సుంద‌రిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది దివంగ‌త న‌టి శ్రీ‌దేవి. ఆమె కూతురు జాన్వీక‌పూర్ కూడా త‌ల్లికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటుంది. ధ‌డ‌క్ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలోనే శ్రీ‌దేవి గారు మ‌ర‌ణించారు. దీంతో ఆమె కూతురు న‌ట‌న‌ను తెర‌పై చూడ‌కుండానే అనంత‌లోకాల‌కు వెళ్లిపోయారు. ఇక తాజాగా జాన్వీ న‌టిస్తున్న రూహిBollywood చిత్రం నుంచి ఓ పాట‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Jhanvi kapoor

అందులో జాన్వీ త‌న అందాల‌తో అదిరిపోయేటా స్టెప్స్ వేయ‌డంతో త‌న హావ‌భావ‌ల్లో అచ్చం త‌న త‌ల్లి శ్రీ‌దేవిని గుర్తుతెప్పించింది. ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. దీంట్లో జాన్వీ గోల్డ్ మిర్ర‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో జాన్వీ అందాలు యువ‌త‌రానికి స్పెష‌ల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక రూహి అఫ్జానా చిత్రం హ‌ర్ర‌ర్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతుండ‌గా.. జాన్వీక‌పూర్‌కు జోడీగా రాజ్‌కుమార్‌రావు న‌టిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి హార్దిక్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో.. దినేశ్ విజ‌న్ Bollywoodనిర్మాత‌గా.. స‌చిన్ జిగ‌ర్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించారు. ఈ Bollywoodసినిమా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.