థియేట‌ర్ల‌లో ఫ్రీ పార్కింగ్ వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోయాం.. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబ‌ర్ విజ్ఞ‌ప్తి!

తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జిల్లాల నుంచి ఎగ్జిబ్యూట‌ర్స్ హాజ‌ర‌య్యారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఈ సమావేశం జ‌ర‌గ్గా.. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎగ్జిబ్యూట‌ర్స్‌. పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా థియేటర్స్ యాజమాన్యానికి పూర్తి హక్కులు ఇవ్వాలి. కోవిడ్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్స్ కరెంట్ చార్జీలు మాఫీ చేయాలి. టిక్కెట్ రెట్లు పెంచుకునేలా, అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్ లో ఇచ్చిన జీవో ను వెంటనే అమలు పరచాలని టి యస్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది.

Movie Association

ఈ సంద‌ర్బంగా సుదర్శన్, దేవి థియేటర్స్ ఓనర్ గోవింద్ రాజ్ మాట్లాడుతూ… ఎగ్జిబిటర్స్ ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేది పార్కింగ్, క్యాంటీన్ లే. ఫ్రీ పార్కింగ్ వాళ్ల మేము ఎంతో నష్ట పోతున్నాము. నామినల్ పార్కింగ్ ఫీజు థియేటర్స్ కో కల్పించండి అని ప్రభుత్వం కి విజ్ఞప్తి చేస్తున్నాము. 4, 5 years బ్యాక్ మల్టీప్లెక్స్ లొ ఎక్కువ చార్జీలు వసూలు చేసారు అది తప్పే. పార్కింగ్ చార్జీలు కల్పించండి అని అన్నారు.

విజయేందరెడ్డి ( ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ)…మాట్లాడుతూ; దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే పార్కింగ్ ఫీజు లు లేవు. దయచేసి పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా సిఎం కేసీఆర్‌ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటీవలే చిరంజీవి గారు నాగార్జున గారు, సీఎం కేసీఆర్ గారిని కలసినప్పుడు అనేక వరాలను ఎనౌన్స్ చేసారు. అవి వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

సునీల్ నారంగ్( తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ) మాట్లాడుతూ… సింగిల్ థియేటర్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు… వెంటనే పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా గవర్నమెంట్ వెంటనే జీవో ఇవ్వాలి.. సేవ్ థియేటర్స్ అని అన్నారు.

మురళి మోహన్ (తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్) మాట్లాడుతూ:.. మేము కొవిడ్ స‌మ‌యంలో కూడా ఎన్ని ఇబ్బందులు వున్నా వర్కర్స్ కి జీతాలు చెల్లించాము.. థియేటర్స్ నిలబడాలి అంటే పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలి అని అన్నారు.