Tollywood: 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి చిత్రాలను నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పడు మరోసారి అలాంటి అవార్డు వచ్చే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నరసింహనంది. భీమవరం టాకీస్ బ్యానర్‌పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న జాతీయ రహదారి చిత్రానికి నరసింహనంది దర్శకత్వం వహిస్తున్నాడు.
Tollywood ఈ చిత్రంలో మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్రెడ్డి, అభి, శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ..Tollywood డైరెక్టర్ నరసింహనందికీ, ఈ చిత్ర నిర్మాతలకు అభినందనలు తెలిపారు. అలాగే Tollywood నిర్మాత రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకుని 101వ సినిమాగా జాతీయ రహదారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం అభినందించాల్సిన విషయం అని అంబికా కృష్ణ పేర్కొన్నారు. అలాగే తెలుగు చిత్రపరిశ్రమలో మనం చాలా వెనకబడి ఉన్నాం. తమిళ్లో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో జల్లికట్టు సినిమాలు ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లాయి.. ఆస్కార్ స్థాయికి Tollywood తెలుగు సినిమాలు వెళ్లేలా తెలుగు దర్శక నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాతీయ రహదారి సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని, ఈ చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ గారికి మంచి పేరు, గుర్తింపు రావాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ Tollywood ఈ సినిమా మంచి విజయం సాధించాలని అంబికా కృష్ణ పేర్కొన్నారు.