Tollywood: సుమంత్ రేపు జ‌న్మ‌దినం.. ఇవాళ న్యూమూవీ లుక్ రిలీజ్‌‌!

Tollywood: హీరో సుమంత్ వైవిధ్య‌మైన చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ‌లో త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో విభిన్న‌మైన చిత్రంలో న‌టిస్తున్నాడు సుమంత్.. కాగా‌ రేపు సుమంత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌ న‌టిస్తున్న Tollywood తాజా చిత్రం అన‌గ‌న‌గా ఓ రౌడీ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రబృందం. అలాగే ఈ చిత్రంలో సుమంత్ పాత్ర పేరు వాల్తేరు శ్రీ‌ను అని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

sumanth new movie

ఈ చిత్రాన్ని మ‌ను య‌జ్ఞ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ఏక్ దోతీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేశ్‌, డా.టీఎస్ వినీత్ భ‌ట్Tollywoodఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం కాగా.. ఇక ఈ చిత్రంలో సుమంత్ జోడీగా ఐమా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే మ‌ధునంద‌న్‌, ధ‌న్‌రాజ్‌, హైప‌ర్ ఆది, మిర్చి కిర‌ణ్‌, ప్ర‌భ త‌దితరులు ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఇక Tollywood ఈ చిత్రానికి మార్క్‌. కె. రాబిన్ స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.