హాలీవుడ్‌లోకి ధనుష్.. ఈ నెలలోనే షూటింగ్

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ నటుడిగా మారిపోయాడు. ఇప్పటికే హాలీవుడ్‌లో ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ అనే సినిమాల్లో ధనుష్ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్ నటించనున్నాడు. అవెంజర్స్ సినిమాలను తెరకెక్కించిన రూస్సో బ్రదర్స్ తెరకెక్కించనున్న ఒక సినిమాలో ధనుష్ నటించనున్నాడు.

dhanush hollywood entry

ఈ సినిమాకి ది గ్రే మ్యాన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఈవెన్స్ ముఖ్యపాత్రలలో నటించనున్నారు. ఈ నెలలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెండు నెలల పాటు అమెరికాలోనే ధనుష్ ఉండనున్నాడు. అయితే హాలీవుడ్ నుంచి ధనుష్‌కి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత వాటికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.