కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ వల్ల అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా…. ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం నడుస్తూనే ఉంది. చాలా కంపెనీలు ఆగస్టు వరకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. కొంతమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బాగుందని అభిప్రాయపడుతుండగా.. మరికొందరు బోర్‌గా ఫీల్ అవుతుందని అంటున్నారు.
అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా వర్క్ ఫ్రం హోంపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంటి నుంచి పని చేయాల్సిన సమయాన్ని ఆస్వాదించలేనని జాన్వీ కపూర్ చెప్పింది. అసలు అలాంటి పని ఆసక్తిగా ఉండదని తెలిపింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ల్యాప్ టాప్ ముందు కూర్చోని ఉన్న ఫొటోని షేర్ చేసిన జాన్వీ.. ఇంటి నుంచి పని చేయండి.. వారు చెప్పినట్లుగా సరదాగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించింది. కాగా ప్రస్తుతం దోస్తానా 2లో జాన్వీ నటిస్తోంది.