డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్, మిరపకాయ్, డీజే వంటి ఎన్నో హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించినది డైరెక్టర్ హరీష్ శంకర్. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో వివిధ ప్రొడక్షన్స్ హరీష్ శంకర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ అయినా జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ ద్వారా హరీష్ శంకర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనతో కలిసి చేసిన గబ్బర్ సింగ్ చేయడం తనకి సంతోషకరం అని, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకులను మెప్పినేచేలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తేలిపారు.