జబర్దస్త్ ఆర్టిస్ నరేశ్ అంటే పరిచయం అక్కర్లేదు. 20ఏళ్ల కుర్రాడే అయినా జన్యులోపంతో ఐదేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యిందని పదే పదే చెప్తుంటాడు నరేశ్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో నటించడమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం ఈవెంట్స్ చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. అయితే ఎంత హ్యాపీగా ఉన్నా కూడా లైఫ్‌లో కొన్ని చేదు నిజాలు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి. నరేశ్ జీవితంలో కూడా అలాంటిదే ఉంది. ఓ ఈవెంట్ కోసం తొలిసారి అమెరికాకు వెళుతుండగా..
తన ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే ముందు తన తాతయ్య చనిపోయాడని.. ఆ సమయంలో అంత్యక్రియల కోసం కనీసం చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో బుల్లెట్ భాస్కర్‌ను అప్పు అడిగానని చెప్పాడు. ఇక తాతయ్య కార్యక్రమాలు పూర్తయని అనంతరం అమెరికా ఈవెంట్‌కు వెళ్లానని.. అక్కడ వచ్చిన డబ్బులతో బుల్లెట్ భాస్కర్ అప్పు తీర్చానని నరేశ్ చెప్పాడు. అమెరికాలో తాను చేసిన తొలి ఈవెంట్ ఇదేనని.. అందువల్ల ఈ షీల్డ్ అంతే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. నిజానికి నరేశ్ తన ఇంటిని షీల్డ్స్‌తో నింపేశాడు.. కళాకారుడికి డబ్బుల కన్నా ఈ షీల్డ్స్ అంటేనే ప్రాణమని చెప్పుకొచ్చాడు. అయితే ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం హోంటూర్ వీడియో చేయగా.. అందులో భాగంగానే నరేశ్ ఈ ముచ్చట్లు చెప్పారు.