చిరుకు జోడీగా నయనతార

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమా తెలుగులోకి రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి హీరోగా నటించనుండగా… మోహన్ రాజా ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కోసం అనేకమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు సుహసిని, విజయశాంతి, జెనిలియా, ఖుష్బు, రమ్యకృష్ణ, నదియ పేర్లను మేకర్స్ పరిశీలించారు.

Nayanthara in lChiranjeevi’ Lucifer

కానీ చివరిగా నయనతార పేరును ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ సినిమాలోని పాత్రకు నయనతార అయితే కరెక్ట్‌గా సరిపోతుందని చిరు, మోహన్ రాజు భావించారట. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిన నయనతార, సైన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు.