Bollywood: అనురాగ్‌క‌శ్య‌ప్‌, తాప్సీ ఇళ్ల‌లో ఐటీ సోదాలు..

Bollywood: ప్ర‌ముఖ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ నివాసాల్లో.. ఆఫీస్‌లో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు వికాస్ భ‌ల్‌, మ‌ధు వంతెన‌ల ఆస్తుల‌పై ఇన్‌క‌మ్ టాక్స్ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. అనురాగ్ క‌శ్య‌ప్ చెందిన ఫాంట‌మ్ ఫిల్మ్స్‌, టాలెంట్ హంట్ కంపెనీ కార్యాల‌యాల్లో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు ఐటీ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ సోదాలు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

Thapsee

అలాగే Bollywood అనురాగ్ క‌శ్య‌ప్‌, విక్రమాధిత్య‌, మ‌ధు వంతెన క‌లిసి 2015లో ఫాంట‌మ్ ఫిలింస్ ను ప్రారంభించారు. ఈ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. అలాగే ఇందులో రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు యాభై శాతం స్టేక్ తీసుకున్నారు. అలాగే ఈ ప్రొడ‌క్ష‌న్‌లో పనిచేసిన ఉద్యోగి లైంగిక వేధింపుల కేసును న‌మోదు చేశారు. అందులో ప్ర‌ధానంగా వికాస్ భ‌ల్ పేరును న‌మోదు చేశారు. దీంతో ఇప్పుడు ఆ కేసుతో సంబంధం ఉన్న వారి ఆస్తుల‌పై ఐటీ సోదాలు చేస్తున్నారు. ముంబై, పుణెల్లో ఏక‌కాలంలో 20చోట్ల సోదాలు జ‌రుపుతున్నారు ఐటీ శాఖ అధికారులు.