విశాల్ తన సినిమా కోసం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు వాడుకుంటున్నారా?

తమిళ హీరో విశాల్ రత్నం సినిమా త్వరలోనే రాబోతుంది. అయితే ఆ సినెమా ప్రమోషన్లలో భాగంగా విశాల్ కొన్ని తెలుగు మీడియా మాద్యమాలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఓ ఛానల్ ప్రతినిధి హీరో విశాల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి అడగటం జరిగింది. తెలుగు ప్రజల మేలు గురించి రిపోర్టర్ ప్రశ్నించగా రిపోర్టర్ ప్రశ్నకు సమాధానంగా హీరో విశాల్ ఎన్నికలలో సమాధానం తెలుస్తుంది అన్నారు. తనకి వ్యక్తి గతంగా వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం అని, తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుండి తనని చూస్తునాను అని అన్నారు. అలాగే ఇటీవలే వైఎస్ జగన్ మీద జరిగిన దాడి గురించి రిపోర్టర్ ప్రశ్నించగా వైఎస్ జగన్ కి ఈ దాడులు కొత్త కాదని, గతంలో ఎయిర్ పోర్ట్ లో ఇంతకంటే దారుణంగా కత్తి తో దాడి చేసారని అన్నారు. ఎవరు ఈ దాడి చేసి ఉంటారు అని అడిగినప్పుడు అది తెలుసుకోవడానికే సిబిఐ వారు ఉన్నారని అన్నారు. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు సక్రమంగా పరిపాలిస్తే మా లాంటి వారు రాజకీయాలలోకి రారు అని కామెంట్ చేసారు. మేము ప్రజ్నలని ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటామని అన్నారు.