యువ హీరో నితిన్ మొత్తనికి ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 26న హైదరాబాద్ లోనే తన ప్రేయసి షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఈ పెళ్లి వేడుకకు అతిధులు ఎవరెవరు రాబోతున్నారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చాలా మందికి ఆహ్వాన పత్రికలు అందించిన నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా స్పెషల్ గా వెడ్డింగ్ కార్డ్ అందించాడు.
ఇక వేడుకకు ఎవరు వచ్చినా రాకున్నా అభిమానుల దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది. కెరీర్ మొదట నుంచి పవన్ అభిమానిగా ఉన్న నితిన్ తన జీవితంలో జరిగే అతి ముఖ్యమైన పెళ్లి వేడుకకు పవన్ ని పిలవకుండా ఉంటాడా అనేది అందరిలో మెదులుతోంది. కానీ కరోనా కారణంగా ఎక్కువమందిని కూడా పిలవకూడదు అనే నియమాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ వెళ్లి ఉంటుందని టాక్. త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే నితిన్ పెళ్లికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.