బిగ్ బాస్ కి పోటీగా విజయ్ దేవరకొండ.. ఏం జరుగుతోంది?

మొత్తానికి బిగ్ బాస్ షో సీజన్ 4 అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. త్వరలో షో మొదలు కానున్నట్లు స్టార్ మా లోగో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం హోస్ట్ గా నాగార్జున మళ్ళీ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు టాక్ వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా ఈ సారి షోపై ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది.

ఎందుకంటే కరోనా సమయంలో ఎలాంటి సెలబ్రెటీలు ఎంట్రీ ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. విజయ్ దేవరకొండ కూడా షోకి హోస్ట్ గా సెలెక్ట్ అయ్యాడనే ఒక టాక్ వచ్చింది. కానీ ఆ గాసిప్ ఎక్కువరోజులు వైరల్ అవ్వలేదు. ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బిగ్ బాస్ కి పోటీకి మరొక ఛానెల్ లో ఇదే తరహాలో ఒక రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

గతంలో రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీతో మిగతా రియాలిటీ షోలకు ఎలాంటి పోటీని ఇచ్చాడో అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా బిగ్ బాస్ షోకి పోటీని ఇచ్చే విధంగా ఒక షోను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందు బిగ్ బాస్ పై హోస్ట్ ఎవరనేది తెలియాలి. మరి స్టార్ మా ఈ సారి ఆడియెన్స్ కి ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి.