రేపు సాయంత్రం నిహారిక-చైతన్యల పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఈ జంట లవ్ మ్యారేజ్ చేసుకుంటుండగా.. మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. యాంకర్‌గా టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక.. ఆ తర్వాత యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయింది. దీని తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా కూడా సినిమాలు చేసింది. కానీ హీరోయిన్గా ఆమె నటించని సినిమాలు ప్లాప్ కావడంతో హీరోయిన్గా ఇంకా సక్సెస్ కాలేదు.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని నిహారిక చెప్పడంతో.. ఆమె హీరోయిన్ కెరీయర్ ఇంకా కొనసాగుతుందని అర్థమవుతోంది. అయితే నిహారిక భర్త చైతన్య గురించి చాలామందికి తెలియదు. అతడి పేరు చైతన్య జోన్నలగడ్డ. ఇతడు గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ రావు కుమారుడు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్ స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నాడు. ఆ తర్వాత బిట్స్ బిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీల్లో చదువును పూర్తి చేశాడు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక MNC కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా చైతన్య పనిచేస్తున్నాడు. చైతన్య ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే.. అతడికి ట్రావలింగ్, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని అర్థమవుతోంది. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, అందమైన ప్రదేశాలను చిత్రీకరించడం అతడికి ఇష్టం. చైతన్య ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే.. సింపుల్‌గా జీవించడం ఇష్టమని తెలుస్తోంది. అంతేకాకుండా మ్యూజిక్ వినడం, వాచ్‌లను కలెక్ట్ చేయడం అతడికి ఇష్టమని తెలుస్తోంది. ఇక కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరు కలిశారని ఒక ప్రచారం ఉండగా.. నాగబాబు, చిరంజీవి తండ్రి వెంకటేశ్వరరావు, చైతన్య తండ్రి ప్రభాకర్ రావు మంచి ఫ్రెండ్ అని, అలా చైతన్య, నిహారిక కలిశారని మరో ప్రచారం ఉంది.స