ఈ ఏడాది టాప్‌లో సల్మాన్ ఖాన్

2020వ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ ఏడాది ట్విట్టర్‌లో టీవీ షోలకు సంబంధించి ఎక్కువగా ట్వీట్ చేసిన షోల వివరాలను ట్విట్టర్ వెల్లడించింది. టీవీలకు సంబంధించి ఈ ఏడాది బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 13,14 గురించి ఎక్కవమంది ట్వీట్ చేసినట్లు తెలిపింది. దీని తర్వాత నాగిణి 4 సీరియల్‌ గురించి ఎక్కువమంది ట్వీట్ చేసినట్లు తెలిపింది.

salman kahan

ఆ తర్వాత యే రిష్టా క్యా కెహ్లతా హై షో గురించి ఎక్కవమంది ట్వీట్ చేసినట్లు తెలిపింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం అవ్వగా.. ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్‌గా నిలిచింది. ఇక బిగ్‌బాస్ 14 గురించి కూడా ట్విట్టర్‌లో ఎక్కువ చర్చ జరిగింది. ఎలిమినేషన్ ప్రక్రియ వివాదాస్పదం కావడం,అభిమానుల మధ్య యుద్ధాలు చోటుచేసుకోవడంతో ఈ సీజన్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

నాగిణి 4 ఆగస్టులో ప్రారంభమవ్వగా. సుర్బీ సంద్నా, మెహిత్ సెహగల్, శరద్ మల్హోత్రా ప్రధాన పాత్రలలో నటించారు.