యంగ్ హీరో సంచలన నిర్ణయం.. 35 ఏళ్లకే రిటైర్మెంట్

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ అభిమానులకు షాకిచ్చే వార్త చెప్పాడు. నటనకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన అభిమానులకు షాక్‌కు గురి చేసింది. కేవలం 35 ఏళ్లకే నటనకు ఇమ్రాన్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై జోరుగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కి స్వయానా ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు. 

బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో ఇమ్రాన్ ఖాన్ నటించాడు. బాలీవుడ్‌లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది. తొలి సినిమా జానే తూ జానేనాతోనే నటుడిగా ఇమ్రాన్ ఖాన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. 20 ఏళ్లకు హీరో అయిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ జానేనా తర్వాత మామ అమీర్ ఖాన్ నిర్మించిన ఢిల్లీ బెల్లీ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

2015లో కంగనతో నటించిన కట్టీ బట్టి తర్వాత ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ మరో సినిమా చేయలేదు. అందరూ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రిటైర్మెంట్ ఇచ్చేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈయన వయసు 35 సంవత్సరాలు మాత్రమే. అయితే నటనకు గుడ్‌బై చెప్పి దర్శకత్వం వైపు ఇమ్రాన్ ఖాన్ కన్నేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.