స్పీడ్ పెంచిన బన్నీ… టార్గెట్ ఇండియన్ మార్కెట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచే పనిలో పడ్డాడు. ఇప్పటికే పుష్ప టీజర్ ని యౌట్యుబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న బన్ని ఒకేసారి నాలుగు సినిమాలని లూప్ లైన్ లో పెట్టాడు. పుష్ప సినిమాని రెండు పార్ట్శ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవగా, ఈ రెండు పార్ట్శ్ మధ్యలో శ్రీరామ్ వేణుతో ఐకాన్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. పుష్ప వల్ల ఐకాన్ డిలే అయ్యింది కానీ లేదంటే ఈ పాటికి ఐకాన్ షూటింగ్ కూడా మొదలయ్యేది. పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి సెకండ్ పార్ట్ రిలీజ్ కి ఏడాది గ్యాప్ ఉండడం, శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ లాంటి హిట్ ఇవ్వడం, ఆగిపోయింది అనుకున్న ఐకాన్ మూవీని మళ్ళీ మొదలయ్యేలా చేసింది. ఐకాన్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి బన్నీ పుష్ప2 టీంని జాయిన్ అవనున్నాడు.

ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సరికి ఎటు లేదన్న వచ్చే ఎండాకాలం వరకూ పడుతుంది. ఈ మూడు అవగానే అల్లు అర్జున్ కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కొరటాల శివ మూవీ అయిపోగానే బన్నీ, మురుగదాస్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ సరైనోడు లాంటి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో మాత్రం బన్నీ సినిమా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. కొరటాల ప్రాజెక్ట్ అవగానే బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పై లిస్టులో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా కావడంతో అల్లు అర్జున్ భారి మార్కెట్ నే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.