సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ… అన్ని లాంగ్వేజ్‌లో రకరకాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమన, విభిన్నమైన సినిమా ఇది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. ఆడియన్స్‌కు థియేటర్‌కు ఎందుకు రావాలో అన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాలయాలోని అందరమైన ప్రదేశాల్లో షూట్ చేసిన చిత్రమిది. ఈ కథ విన్నప్పుడు అక్కడే చేయాలని అనిపించింది. ఎన్నో వ్యయ ప్రయసాలతో చిత్రీకరణ చేశాం. ఈసినిమా ప్రొడక్షన్ ఎలా జరిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామనే నమ్మకం కలిగింది. ఇక సినిమా ఫలితం ఆడియన్స్ చేతిలో వుంది కథ వినగానే నచ్చిన సినిమా ఇది. నా పర్సనల్ లైఫ్‌లో నా ప్రేమకథలు, నా లవ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను టచ్ చేశాం. ఈ కథ, ఈ పాయింట్ కనెక్్ట అయితే వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని వుంది. ఈ 20 ఏళ్ల కెరీర్ తరువాత నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది.
దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ… ఇందులో నేటి యువతరానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అందరికి రిలేట్ అయ్యే అంశాలు, కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమలో వున్న వారి రిలేషన్స్ ఎలా వున్నాయి. నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రేకప్‌లు అవుతున్నాయి. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ఈ సినిమా డీఐ కేరళలో జరుగుతున్నప్పుడు మంజుమ్మల్ బాయ్, ఆవేశానికి పనిచేసిన కలరిస్ట్ మా సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినిమా చూసి ఎంతో అభినందించాడు. ఆయన అందించిన ప్రశంసలు మరువలేనిది. రేపు చిత్ర విడుదలైన తరువాత కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడ్డాడు. ఆయన అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
రచన -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాటల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి