విడాకుల తరువాత చాలా సంతోషంగా ఉంటున్నా: యాంకర్ ఝాన్సీ

ఝాన్సీ తెలుగులో టాప్ యాంకర్ గానే కాకుండా చాలా కాలం నుండి బిగ్ స్క్రీన్ పై స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని రూమర్స్ రాగా ఒక ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మొదట ఝాన్సీ ఒక టాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకోగా కొద్దీ కాలానికే అతనికి విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం తన కూతురితో హ్యాపీగా ఉంటోంది.

ఇక ఇటీవల ఒక టీవీ షోలో మాట్లాడిన ఝాన్సీ తన పెళ్లి గురించి బహిరంగంగానే మాట్లాడారు. ఝాన్సీ మాట్లాడుతూ.. నాకు మొదట ఇబ్బందికరమైన వివాహం జరిగిందని ఆ తరువాత చాలా మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపింది. మాజీ భర్త కూడా పరిశ్రమకు చెందినవాడు కాబట్టి, గత కొన్నేళ్లుగా తన గురించి చాలా చెడ్డగా వార్తలు రాశారని తెలిపింది. కొన్నాళ్లకు అలాంటి పుకార్లకు శ్రద్ధ చూపడం మానేసి, సంతోషంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాని ఝాన్సీ చెప్పారు.