హమ్ ఆప్కే హై కౌన్ @26: వంద కోట్లు అందుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా

సల్మాన్ కెరీర్ ని ఒక్కసారిగా తిరగరాసిన సినిమాల్లో హమ్ ఆప్కే హై కౌన్ ఒకటి. కేవలం సల్మాన్ ఖాన్ కెరీర్ కి అనే కాకుండా బాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా అది. మాధురి దీక్షిత్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ఇప్పటికి టీవీలలో వస్తే టాప్ రేటింగ్స్ అందుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో సరిగ్గా 26ఏళ్లవుతోంది.

1994లో ఆగస్టు 5న విడుదలైన హమ్ ఆప్కే హై కౌన్ సినిమా సింపుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. అయితే అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇండియన్ బాక్సాఫీస్ లో అప్పటి వరకు ఏ సినిమా అందుకొని కలెక్షన్స్ అందుకుంది. మొట్టమొదటి సారి ఇండియాలో 100కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న సినిమా ఇదే. 5కోట్ల బడ్జెట్ లోపే ఈ సినిమాను నిర్మించారు. అంటే లాభాలు ఏ స్థాయిలో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విడుదలైన మొదటి వారం లక్షల్లో కలెక్షన్స్ రాగా ఆ తరువాత కంటిన్యూగా 5వారాల పాటు రోజు కోటికి పైగా వసూళ్ళని అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాను ప్రేమలయం పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.