యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్ర కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ముందుగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీర్యిన్ దీపికా పదుకొణేను తీసుకోవాలని సినిమా యూనిట్ భావించింది. కానీ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణెను హీరోయిన్గా ఇప్పటికే ఫిక్స్ చేశారు.
దీంతో వరుసగా రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ అయితే బాగుండదనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దాంతో ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర కోసం పలువురు హీరోయిన్ల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ, పూజాహెగ్డే, రకూల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపించగా.. తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్లు సీత పాత్రకు సరిపోరని ఆదిపురుష్ సినిమా యూనిట్ భావిస్తోంది.
బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ఇంటర్నేషనర్ స్టార్‌గా ప్రభాస్ మారిపోయాడు. దీంతో తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.