ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ చూడని, కలలో కూడా ఊహించని ఒక యాక్షన్ బొనాంజాకు బాలీవుడ్ రంగం సిద్ధం చేస్తోంది. బాలీవుడ్ హీ మ్యాన్ హృతిక్‌రోషన్ కి కంబాక్ హిట్ గా నిలిచిన సినిమా వార్. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రూపొందించాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. వార్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హ్రితిక్, సిద్దార్థ్ ఆనంద్ భారి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. తొలి భారతీయ ఏరియల్ యాక్షన్ మూవీగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. దీపికా పదుకోన్ కథానాయికగా నటించనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘ఫైటర్’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలన్నీ గగనతలంలో యుద్ధ విమానాలు, మిసైల్స్ నడుమ సాగుతాయి. దేశ భద్రతా దళాల పోరాట స్ఫూర్తికి, అసమాన త్యాగానికి, ధైర్యసాహసాలకు వెండితెర దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘నా కలల సినిమా ఇది. విశ్వవ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులు మెచ్చేలా, భారతీయ సినిమా సాంకేతికతను అందరికి పరిచయం చేసేలా ఈ సినిమాను రూపొందించబోతున్నాం’ అన్నారు.
గత ఏడాది హృతిక్ రోషన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు కానీ ఎలాంటి కథతో క్రితిక్, సిద్దార్థ్ సినిమా చేస్తున్నారు అనే విషయం మాత్రం అప్పుడు బయట పెట్టలేదు. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా గురించిన తాజా సమాచారాన్ని వెల్లడించారు. వయాకామ్ 18 స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది. ‘వార్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘ఫైటర్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫ్రాంచైజ్ నుంచి మొదటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ లో ఫాస్ట్ అండ్ ఫ్యురియాస్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండ్ హై మేకింగ్ స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తే ఫైటర్ మూవీతో హ్రితిక్ రోషన్ హాలీవుడ్ ని మరిపించినా ఆశ్చర్యం లేదు.